పుట:Lokokthimukthava021013mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

551 ఎందుకుఏడుస్తావురా పిల్లవాడా అంటే ఎల్లుండి మావాళ్ళు కొట్తుతారు అన్నాడట

552 ఎక్కడకట్టితేనేమి మనమందలో యీని తేసరి

553 ఎక్కడకొట్తినా కుక్కకు కాలుకుంటు

554 ఎక్కడనైనా బావా అనవచ్చును గాని వంగతోటదగ్గిర బావా అనకూడరు

555 ఎక్కడున్నవే కంబళీఅంటే వేసినచోటనేవున్న వెంబళీ అన్నదట

556 అక్కడికి పోతావు కిధమ్మాఅంటే వెంటనేవస్తాను పదమ్మా అన్నదట

557ఎక్కితే గుర్రపురౌతు దిగితే కాలిబంటు

558 ఎక్కినవానికి ఏనుగులొజ్జు

559 ఎక్కిపోయి పట్టిచూచి దిగివచ్చి రాళ్ళురువ్వినాడట

560 ఎక్కిరించబోయి వెలకిలబడ్డాడట

561 ఎక్కూఅంటే ఎద్దుకుకోపం దిగూ అంటే కుంటివానికికోపం

562 ఎచ్చులకు ఏలూరుపోతే తన్ని తలగుడ్డలాకున్నారట

563 ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య

564 ఎగరబోవుచు బోర్లబడి యీవురు అచ్చిరాదన్నాడట్టు

565 ఎత్తుకతిన్న వాణ్ణీ పొత్తులో పెట్టుముంటే అంతాతీసిబొంతలో పెట్టుకొనెనట

566 ఎత్తుకొని తిన్నబోలె ఎదురుగావస్తే సంకనున్నజోలే సలాంచేసిందట

567 ఎత్తుపడ్డ గొడ్డు పులికి జడుస్తుంది