పుట:Lokokthimukthava021013mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

568 ఎదట అన్నదిమాట యెదాన పెట్టింది రాత

569 ఎదటవున్నవాడు పెళ్లికొడుకు

570 ఎదటపొయ్యిమండితే తనపొయ్యిలోనీళ్ళు పోసుకున్నట్లు

571 ఎదుగువడ్డమ్మ ఎండిపోయినదట

572 ఎద్దుతన్నునని భయపడి గుఱ్ఱముచాటున దాగినాడట

573 ఎద్దు దున్నగా పిణుజు లొగిరించినదట

574 ఎద్దు నడిగా గంతకట్టటం

575 ఎద్దును కొద్దిలో కొనరాదు బట్టలు బారిలో కొనరాదు

576 ఎద్దునుజూస్తే ముద్దేగాని దున్నబోతే దు:ఖమువస్తుంది

577 ఎద్దునెక్కినవాడే లింగడు గద్దెనెక్కినవాడే రంగడు

578 ఎద్దుపుండు కాకికిమొద్దా

579 ఎద్దుఈనెనంటే కొట్టానగట్టమన్నట్టు

580 ఎద్దుయెండకులాగ దున్ననీడకులాగ

581 ఎద్దులవెంబడే తాళ్ళు

582 ఎద్దుమోసినంత గోనెపట్టినంత

583 ఎద్దులాగున్నావు తేలుమంత్రంరాదా

584 ఎద్దులుబండియు నేకమై కొండమీదికిపోవును

585 ఎద్దేమి యెదుగురా అటుకులరుచి గాడ్దేమిఎరుగురా గంధపు వాసన

586 ఎనుబోతుమీద వానకురిసినట్లు

587 ఎనుము యీనినది రెడ్డీఅంటే నీకేమికద్దేబొడ్డీఅన్నట్లు

588 ఎన్నడుఎరగనిరెడ్డి గుఱ్ఱముఎక్కితే వెనుకముందాయెను

589 ఎన్నిబూతులైనా పిదికెడు కొర్రలుకావు