పుట:Lokokthimukthava021013mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

151 అమావాస్య ప్రొద్దుకు వంగలు కాచునా

152 అమ్మగా మిగిలిన మేక

153 అమ్మ గృహప్రవేశము, అయ్య స్మశానప్రవేశము.

154 అమ్మ చేడ్డచేటకు ముసుగు ఒకటా

155 అమ్మ తాను పెట్టదు. తెచ్చుకు తిననివ్వదు.

156 అమ్మదగ్గర కింద పడుకొన్నాఒకటే అబ్బదగ్గర నేలపడుకొన్నా వకటే

157 అమ్మ పెట్టేనాలుగూ అప్పుడేపెడితే చయ్యనా.

158 అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.

159 అమర్చించానిమీద అత్తగారిచేయి.

160 అయితంపూడి ఉద్యోగం అయితేగియితే ఆరావుల పాడి చేస్తే గీస్తె పరుగూ పాలు మీవారికి పోస్తావా మావారికి పోస్తావా

161 అయితే ఆడుబిడ్డ, కాకుంటే మొగబిడ్డ.

162 అయితే ఆదివారం కాకుంటే సోమవారం

163 అయితే ఆరుగ కాకపోతే కంది.

164 అయినపనికి చింతించేవాడు అల్పబుద్ధివలవాడు.

165 అయినవారందరు ఆత్రోవనుపోగా జంగాన్నిపట్టుకొని జాము ఏడ్చినాడు.

166 అయ్యకుదురవలె అమ్మకుదురవలె

167 అయ్యకు విద్యాలేదు, అమ్మకు గర్వములేదు.

168 అయ్యకు రెండుగుణములు తక్కువ, తనకు తోచదు, ఒకడు చెప్పిన వినడు.