పుట:Lokokthimukthava021013mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2299 పులికడుపున చలిచీమలు పుట్టునా

2300 పులికాకలైతే గడ్దితింటుందా

2301 పులినాకి విడిచినట్లు

2302 పులిని చూచి నక్క వాతపెట్టుకున్నట్లు

2303 పులిపక్కను జోరీగవున్నట్లు

2304 పులిపిల్ల పులిపిల్లే మేకపిల్ల మేకపిల్లే

2305 పులిగాడికి గిలిగాడు

2806 పులిమీసాలుపట్టుకు వుయ్యాలలూగినట్లు

2307 పువ్వు విప్పగానే పరిమళం

2308 పుష్యమాసమునందు పువ్వులుగుచ్చ పొద్దుండదు

2309 పుష్యమాసానికి పూసంతవేసంగి

పూ

2310 పూజకొద్దీ పురుషుడు పుణ్యంకొద్దీ పుత్రుడు

2311 పూటకూళ్ళకు వచ్చినవాడికి పుట్లధర యెందుకు

2312 పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు

2313 పూచినతంగేడు వేసినా కాసినవెంపలి వేసినా నేను వండుదును

2314 పూచిన పూవెల్లా కాయాఐతే భూమిపట్ట చోటుండదు

2315 పూతకుముందే పురుగుపట్టినది

2316 పూరా మణిగిన వానికి చలేమి, గాలేమి 2317 పూల చేరెత్తినట్లు

2318 పూలమ్మిన చోట పుడక లమ్మినట్లు