పుట:Lokokthimukthava021013mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2281 పుణ్యానికి పోతే పాపమెదురైనది

2282 పుత్రుడై వేధింతునా శత్రుడై వేధింతునా పేరులెని దయ్యమునై వేధింతునా పెనిమిటినై వేధింతునా

2283 పుచ్చిన వంకాయలు బాపనయ్యకు

2284 పెక్కురేగుల్లో ఒకజిల్లేడు బ్రతుకునా

2285 పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడుపిట్ట అడుగైనాతడియదు.

2286 పురుగు చట్టం పిండినట్లు

2287పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బచ్చి చెట్తుక్రింది నానదు

2288 పుబ్బకెరలితే భూతం కెరలినట్లు

2289 పుబ్బ రేగిగినా బూతురేగినా నిలువదు

2390 పుబ్బలో చల్లేదానికంటె దిబ్బలో చల్లేది మేలు

2291 పుబ్బలో పుట్టెడు చల్లేకంటే దిబ్బలో మఖలో మానెడు చల్లితే మేలు

2292 పుబ్బలోపుట్టెడు చల్లేకంటే ఆశ్లేషలో అడ్డెడుచల్లేది మేలు

2293 పుబ్బలొ పుట్టి మఖలో మాడిపోయింది

2294 పురిట్లోనే నందు కొట్ఘ్టింది

2295 పుర్రు కారుతూవుంటే పోతరాజు శివమాడినట్లు

2296 పురుగు గిరుగుంతిని పుట్టలో నుండక యూరివార్తలన్ని యుడుము కేల

2297 పురుష సింహుడైతే పురుషుణ్ణే పెండ్లాడవలెగాని స్త్రీని పెండాడడమెందుకు

2298 పులగంమీదికి తేడ్డెడుపప్పు