పుట:Lokokthimukthava021013mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2859 పుంటికూరతిన్న పుట్టినిల్లు పాశముతిన్న పరాయియిల్లు

2260 పుచ్చకాయల దొంగ అంటే బుజముతడవి చూచుకున్నట్లు

2261`పుచ్చిన మిర్యాలైనా జొన్నలకు సరితూగక పోవు

2262 పుచ్చిన విత్తనాలు చచ్చినా మొలవవు

2263 పుట్టడం చావడం కొరకే

2264 పుట్టనిబిడ్డకు పూసలు కట్తినట్లు

2265 పుట్టనిబిడ్డకు పేరు పెట్టినట్లు

2266 పుట్టమన్ను వేసిన పుడమి పండుతుంది

2267 పుట్టమీద తేలుకుట్టినా నాగుమయ్య మెహిమేనా

2268 పుట్టకు ధ్వనియెత్తితే పట్టేడు మొగుడికి ద్వానెత్తితే పుట్టేడు

2269 పుట్టించినవాడు పూరిమేవుతాడా

2270 పుట్టిన్నాటినుంచీ వుల్లిగాడే మొగుడా

2271 పుట్టిన్నాటిబుద్ధి పుడకలతోగాని పోదు

2272 పుట్టినపిల్లలు బువ్వకే'డిస్తే అవ్వ మొగుడు కేడ్చినట్లు

2273 పుట్టినన్నాళ్ళకు పురుషుడు యజ్ఞముచేసెను

2274 పుట్టినవానికి తమ్ముడు పుట్టేవానికన్న

2275 పుట్టుచాయెగాని పెట్టుచాయ్వచ్చునా

2276 పుట్టువాసనా పుట్టుశాస్త్రుల్లా పెట్టుశాస్త్రుల్లా

2277 పుట్టెడాముదాము పట్టించుకొని దొర్లినా అంటదుశిరి

2278 పుణ్యం పుట్టేడు పురుగులు తట్టేడు

2279 పుణ్యానికి పుట్టేడిస్తే పిచ్చకుంచమన్నట్లు

2280 పుణ్యానికి పెట్టేఅమ్మా నీమొగుడితో సమానంగాపెట్టు