పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

వర్గ ప్రధమాక్షరములగు (క చ ట త ప లు) - అనునాసికములు పరమగునప్పుడు ఆయా వర్గాను నాసికములు ఆదేశమగును.

వర్గమందలి తొలి అక్షరములైన క చ ట త ప లకు - న మ లు పరమగునపుడు ఆయా వర్గముల తుది వర్ణములు ఆదేశమగును.

       వాక్ + నైపుణ్యము = వాఙ్నపుణ్యము
       వాక్ + మహిమ = వాఙ్మహిమ
       రాట్ + నిలయము = రాణ్ణిలయము
       రాట్ + మందిరము = రాణ్మందిరము
       జగత్ + నాధ = జగన్నాధ
       కకుప్ + నేత = కకుబ్నేత
       లసత్ + మూర్తి = ల సన్మూర్తి
       మృట్ + మయము = మృణ్మయము
             ఇది ఆదేశ సంధి.

6. జస్త్వసంధి :

గ జ డ ద బ లకు ఆదేశముగ వచ్చు సంధి జస్త్వ సంధి.

పరుషములకు అచ్చులుగాని, వర్గ తృతీయ - చతుర్థాక్షరాలుగాని - హయ వరలు పరమైనచో గ జ డ ద బ లు ఆదేశములగును.

   వర్గ ప్రధమాక్షరాలు : క చ ట త ప లు.
                        పరుషములు.
   వర్గ తృతీయాక్షరములు : గ జ డ ద బ లు
                           సరళములు.

సులభ వ్యాకరణము