పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

65

            ప్ర + ఋణము = ప్రార్ణము
            వత్సతర + ఋణము = వత్సతరార్ణము
            దశ + ఋణము = దశార్ణము
            వనన + ఋణము = వననార్ణము
            కంబల + ఋణము = కంబలార్ణము
              ఇవి ఏకాదేశ సంధి.

4. యణాదేశ సంధి :

ఇ - ఉ - ఋ అనువర్ణములు ఇక్కులు

య - వ - ర - ల అనునవి యణ్ణులు.

ఇక్కుల స్థానమున యణ్ణులు ఆదేశమగుటచే ఇది యణాదేశ సంధి

ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరంబగునపుడు వరుసగ య - వ - ర - ల లు ఆదేశమగును.

          అతి + అంతము = అత్యంతము
          అత్ + ఇ + అంతము = ఇ + అ = య్
          మధు + అరి = మధ్వరి
          మధ్ + ఉ + అరి = ఉ + అ = వ్
          పితృ + ఆదరము = పిత్రాదరము.
          ఋ + ఆ = ర్
          ఌ + అకృతి = లాకృతి - ఌ + ఆ = ల్

5. అనునాసిక సంధి :

నాసిక అనగా ముక్కు. ముక్కుతో పలుకు వర్ణములగుటచే వీనికి అనునాసికములని పేరు.

సులభ వ్యాకరణము