పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33

4. షష్ఠి యందు సంబంధార్థమున - నీ - నా - తన - లకు - దు ప్రత్యయము వచ్చుట గలదు. నీపని - నీదు పని - నాదు పుస్తకము.

5. స్త్రీల సంబోధించునప్పుడు రొ - రో - ప్రత్యయములు వచ్చుట గలదు.

అక్కరొ - చెల్లిరో - అమ్మరో!

6. కొన్ని చోట్ల ఒక విభక్తికి మరియొక విభక్తి వచ్చుట గలదు.

1. ద్వితీయకు ప్రధమ అతడు రథమెక్కెను.
ఆమె సొమ్ములు దాల్చెను.
2. తృతీయకు ద్వితీయ కత్తిం గొమ్మను నరికె
3. సప్తమికి ద్వితీయ కుండను నీరున్నది
4. సప్తమికి ప్రధమ వాడు నేడు పోయె, తీర్థమాడితిమి
5. పంచమికి తృతీయ పాపులు బీదలచే లంచము గొందురు
6. ద్వితీయకు చతుర్థి వర్షము కొఱకు జపము.
7. ప్రధమకు షష్ఠి నా చేసిన పని
8. చతుర్ధికి షష్ఠి రామునకు వందనము
9. పంచమికి షష్ఠి రాముడు భరతునకు పెద్ద
10. సప్తమికి షష్ఠి కుండలో నీరున్నది.

(2) సర్వ నామములు - Pronouns

ఇవి ఆరు విధములు.

నామవాచకములకు బదులుగా వాడబడునవి సర్వనామములు. ఇవి ఆరు విధములు.

సులభ వ్యాకరణము