పుట:Lanka-Vijayamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

లంకావిజయము


అర్థము తాత్పర్యము రెండుపక్షముల సమానము సులభము.


ఉ.

భూమి జనించి మించువిరిఁబోణులలో నుతిగాంచినట్టియ
బ్భామిని కచ్ఛపప్రపదభాగయునున్ మకరేంద్రజంఘయుం
గోమలశంఖకంఠియును గుందరదాళియుఁ బద్మవక్త్రదీ
ప్తామలనీలవేణియు వరాంగియు నై నిధిరీతి నొప్పఁగన్.

53


రాఘవ.

భూమి జనించి = భూమిలోఁ బుట్టి, మించువిరిఁబోణులలో = మెఱపుయొక్కయు పుష్పములయొక్కయుఁ గాంతిగలిగిన స్త్రీలలో (మించుఁబోణులు - విరిఁబోణులలో), కచ్ఛపప్రపదభాగయునున్ - కచ్ఛప = తాఁబేళ్లవంటి, ప్రపదభాగయు = మీగాళ్లుగలదియు, మకరేంద్రజంఘయున్ = శ్రేష్ఠమైన మొసళ్ల వంటి పిక్కలుగలదియు, కోమలశంఖకంఠియును = సుందరమైన శంఖమువంటికంఠము గలదియు, కుందరదాళియున్ = మొల్లమొగ్గలవంటి దంతపఙ్క్తి గలదియు, పద్మవక్త్ర = పద్మమువంటి ముఖము గలదియు, దీప్తామలనీలవేణియున్ = ప్రకాశించెడు చక్కనినల్లనిజడ గలదియు, వరాంగియున్ = శ్రేష్ఠావయవములుగలదియునై, నిధిరీతిన్ = నవనిధులవలె, ఒప్పఁగన్, నిధి యనుటచే భూమిలోఁ బుట్టినదనియు, కచ్ఛప, మకర, శంఖాదులగునవవిధులరీతి నున్నదనియు ధ్వనించుచున్నది.


తా.

(సీత) భూమిలో పుట్టి, యందఱుస్త్రీలను మించి, సర్వాంగసుందరియై యున్నది.


లక్ష్మణ.

భూమి జనించి మించు = భూలోకమునం బుట్టి యతిశయించిన, విరిబోణులలోన్ = స్త్రీలలో, ప్రసిద్ధికెక్కినకన్యయై యున్నది. తక్కినది
సమానము.


తా.

తిరుపతన్న కిచ్చెదమన్నకన్యక లోకములో నున్న యువిదలలో నెన్నికయైనది యనుట.


చ.

గొనకొని పెండ్లికూతుజనకుండు వివాహము సేయఁగోరి పూ
నెను దమయింట ము న్నొగి ననేకతరంబులనుండి పూజ్యతం