పుట:Lanka-Vijayamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

53


తా.

రాముఁడు విశ్వామిత్రునియాగమును రక్షించుటకై చని తాటకను సుబాహుఁడు మొదలైన రాక్షసులను జంపి అహల్యను రాతిరూపమునుండి నాతిం జేసి శివునివిల్లు విఱిచినందున సీతను రామునకుఁ బెండ్లి సేసెదము రమ్మని పిలువవచ్చిన జనకరాజుపక్షమునారిని దశరథుఁ డాదరించెను.


లక్ష్మణ.

స్థిర... కౌశికుఁడు - స్థిర = స్థిరమైన, పరభా = శత్రుతేజమును, అద్రి = పర్వతములకు, కౌశికుఁడు = ఇంద్రుఁ డైన, “మహేంద్రగుగ్గులూలూకవ్యాళగ్రాహిషుకౌశికః” అమరము, అయ్య = తండ్రి, జనరక్షకై = పాలనమునకు, నియోగింపన్ = ఏర్పఱచుటకు, సుందరమణిన్ = సుందరులలో శ్రేష్ఠుడును, సుబాహున్ = మంచిబాహువులు గలిగినవాఁడునైన, తదగ్రసూతి = ఆనలుపురుపుత్రులలోఁ బెద్దవాడైన తిరుపతిని, తక్కుఁగలవారిన్ = తక్కిన ముగ్గురను, నిజవిద్యన్ = తననియోగవిద్యయందు, తగుశిక్షణ = తగినయుపదేశము చేసి, తాన = తానే, హల్యనుజాతదయన్ - హలి = బలరాముని, అనుజాత = తమ్ముఁడైన శ్రీకృష్ణుని, దయన్ = దయచే, శుద్ధినొంది = పవిత్రుఁడై, ఆత్మ = మనస్సును, వరసౌఖ్యంబు నొందఁగ నొనర్చి = శ్రేష్ఠసుఖములను బొందింప నెంచి, ఉగ్రధర్మము = తీష్ఠ మైన ధర్మమును, అడంచి = విడిచి, అంతన్, ఆతండ్రి తన పెద్దయాత్మజునకు, సొంపుతో నేలన్ = చక్కఁగాఁ గాపురము చేయుటకు, బొట్టె నిచ్చుట నిజము = మాబిడ్డ నిచ్చుట సత్యము. ఇంకఁ బెండ్లి కేతెండటంచునుఁ బిల్వవచ్చినట్టివారల మన్నించి యాదరించె.


తా.

గోపాలమంత్రి తాను దైవధ్యానమున మనస్సునకు సుఖపెట్టదలఁచి పెద్దకుమారునకుఁ దక్కినవారికిని, తన ప్రజాపాలనభారము నీయ నిశ్చయించుకొని యుండఁగా, పెద్దకొడుకు తిరుపతిమంత్రి కొకరు కన్నె నిచ్చెద మని చెప్పవచ్చిరి.


వ.

అట్లాదరించిన యతండు తత్కన్య కావృత్తాంతం బాత
ఱియగు నచ్చటి వర్తనం బంతయు సవిస్తరంబుగా వినువాఁ
డై యడిగిన వారలాదినుండియుం గలుగు తత్ప్రవృత్తి యేర్ప
డం జెప్పి రె ట్లనిన.

52