పుట:Lanka-Vijayamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

లంకావిజయము


చెడు, ఘనాధ్వర = పుత్రకామేష్టియందు, చితగతి = వ్యాపించినగతిగల, విభావసుఁడు= అగ్నిహోత్రుఁడు, వెలుఁగన్ ,అప్పుడు, తన్మధ్యమందుండి = ఆయగ్నిలోనుండి, కృష్ణాభిఖ్యుఁ డగు = నీలవర్ణముగల, దివ్యపురుషుఁడు = ప్రాజాపత్యపురుషుఁడు, దివ్యభూషణభూషితుడు, సులక్షణయుతుండు, దృష్టిగోచరతనొందన్ =కనఁబడఁగా, అంతన్, ఆగోపాలుఁడు = నరపాలుఁడు, అతిభక్తిన్ = మిక్కుటమైన భక్తితో, కేల్మోడ్చుచున్ = నమస్కరించుచుండగా, వరవిభాప్రసన్నమూర్తి = శ్రేష్ఠకాంతిచే నిర్మల మైనయాకారముగల, భవ్య . . . స్థితి. భవ్య = శుభప్రదమైన, పరమభక్తపాత్రికా = పరమాన్నపాత్రతో (భక్తం = అన్నము, పరమ+భక్త = పరమాన్నము), “భిస్సాస్త్రీభక్తమంధోన్న” అమరము. లసత్ = ప్రకాశించుచున్న, ఉరుశ్రీ = గొప్పశోభకల, కరస్థితి = చేతులయొక్క స్థితి గలిగినట్టియు, శుభకృద్గతి = శుభము చేసెడునడకగలిగినట్టియు, అనుగుణమహిమయుతుఁడు = తగినమహిమతోఁగూడినట్టియు, గురుబుద్ధి = శ్రేషబుద్ధిగల, అతఁడు = అప్పురుషుఁడు, హితతన్ = స్నేహభావముగ, చేరి = సమీపించి, పేరన్ = పేరు పెట్టి, (దశరథుఁడాయని) అతనిన్, పిలిచెను.


తా.

ఋష్యశృంగుఁడు చేయించుయజ్ఞమునం దగ్ని ప్రజ్వరిల్లుచుండ నందుండి యొకదివ్యపురుషుఁడు నల్లనిమేనివాడు బైలుదేఱెను. దశరథుఁ డాతనికి భక్తిపూర్వకముగ నమస్కరించుచుండఁగా నొకపాయసపాత్రఁ జేతఁ బట్టుకొని యాదివ్యపురుషుఁడు దశరథునిఁ బిలిచెను.


లక్ష్మణ.

శాంతాం...గతి - శాంతా = శాంతముచే, అంచిత = పూజ్యులైన, ద్విజ= బ్రాహణుల, సన్మను = సన్మంత్రములచే, ఉజ్జ్వల = ప్రకాశించెడువాఁడు కావుననే, ఘనాధ్వ= అంతరిక్షముందు, రచితగతి = చేయఁబడిననడకగల, విభావసుఁడు = సూర్యుఁడు, వెలుఁగన్, అప్పుడు, తన్మధ్యమందుండి = ఆసూర్యమండలములోనుండి, ఒప్పారు, కృష్ణాభిఖ్యుఁడగు = కృష్ణనామముగల, దివ్యపురుషుఁడు = నారాయణమూర్తి, దివ్యభూషణభూషితుఁడు, సులక్షణయుతుఁడు, అగుచు, దృష్టిగోచరత నొందన్, అంతన్, గోపాలుఁడు = గోపాలమంత్రి, అతిభక్తిన్, కేల్మోడ్చుచున్, నవ. . . మూర్తి - నవ = నూతన మైన, రవిప్రభా = సూర్యకాంతి యనెడు,