కుటుంబ నియంత్రణ - పద్ధతులు 68
వేసిన లూప్‌ని ముందుగా ఎందుకు తీసివేయవలసి వస్తుంది ?
లూప్ వేయించుకున్న వారిలో నూటికి 5-20 మందికి అధిక రక్తస్రావం అవడం, పొత్తికడుపులో నొప్పి రావడం వుంటాయి. రక్తస్రావం ఆగకపోయినా, పొత్తికడుపులో నొప్పి తగ్గకపోయినా లూప్ తీసివేయవలసి వస్తుంది. సాధారణంగా ఇటువంటి బాధలు లూప్ వేసిన మొదటి సంవత్సరంలోనే ఎక్కువ కనబడతాయి. అందుకని లూప్ తీసివేయవలసి రాఫడం ఎక్కువగా మొదటి సంవత్సరంలోనే ఎక్కువ. తరువాత సంవత్సరాలలో బాధలూ తక్కువే. లూప్ తీసివేయవల్సిన అవసరం రావడం కూడా తక్కువే.
లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ ఎందుకని మంచిది ?
లిప్పీస్ లూప్ వేయించుకున్న 4 శాతం మందికి గర్భం రావడం వుంటుంది. అదే కాపర్ -టి 200 లూప్ వేయించుకున్న 2.5 శాతం మందిలో, కాపర్ -టి 220 వేయించుకున్న వారిలో 1.5 శాతం మందిలో, మల్టీ లోడ్ సి.యు 250 లూప్ వేయించుకున్న 0.8 శాతం మందిలోనే గర్భం రావడం జరుగుతుంది.