పుట:KutunbaniyantranaPaddathulu.djvu/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 69

లిప్పీస్ లూప్ వేయించుకున్న స్త్రీలలో బహిష్టు సమయంలో రక్తస్రావం అధికంగా వుంటుంది. అదే కాపర్ -టి లూప్ గాని, మల్టీలోడ్ సి.యు. 250 లూప్ గాని అయితే బహిష్టు సమయంలో రక్తస్రావం తక్కువ అవుతుంది.

బహిష్టు సమయంలో లూప్ జారిపోవడమనెది లిప్పీస్ లూప్ వేయించుకున్న 11 శాతం మందిలో జరుగుతుంది. కాపర్ -టి 200 లూప్ 6.3 శాతం మందిలోనూ, కాపర్ -టి 220 లూప్ 6.3 శాతం మందిలోనూ, మల్టీలోడ్ సి.యు 250 లూప్ 2.2 శాతం మందిలోనూ జారిపోవడం జరుగుతుంది.

అధిక రక్తస్రావం అవడం వల్లనో, పొత్తికడుపులో నొప్పి అనిపించడం వల్లనో లూప్ తీసివేయవలసి రావడం లిప్పీస్ లూప్ విషయంలో 8-4 శాతం మందిలో జరుగగా, కాపర్-టి 200 లూప్ 6.4 శాతం మందిలోనూ, కాపర్ -టి 220 లూప్ 5.3 శాతం మందిలోనూ, మల్టీలోడ్ సి.యు 250 లూప్ 2.4 శాతం మందిలోనూ తీసివేయవలసి వస్తుంది.

లిప్పీస్ లూప్ వెయించుకున్న స్త్రీలలో 69 శాతంమంది సంవత్సరాల తరబడి హాయిగా ఉంచుకుంటారు. కాపర్-టి 200 లూప్ వేయించుకున్న 77 శాతం మంది, కాపర్ -టి 220 లూప్ వేయించుకున్న 82 శాతం మంది మల్టీలోడ్ సి.యు. 250 లూప్ వేయించుకున్న 90 శాతం