Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 56

వేయవచ్చు. అంతేగాని కాన్పు లాగా ఆరువారాలు ఆగనవసరం లేదు.

ఏ సమయంలో లూప్ వేసినా ఆ స్త్రీని కొంతసేపు పడుకుని ఉండమని చెప్పడం మంచిది.

లూప్ వేయించుకున్న తరువాత మళ్ళీ డాక్టరుకి కనబడాలా ?

లూప్ వేయించుకున్న తరువాత ఏమైనా తేడా ఉంటే వెంటనే డాక్టరుకి చూపించుకోవాలి. ఎటువంటి బాధ లేని పక్షంలో మూడు నెలలు గడచిన తరువాత డాక్టరుచేత సాధారణపరీక్ష చేయించుకుని లూప్ ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలుసుకోవడం అవసరం. అటు తరువాత సంవత్సరానికి ఒకసారి చూపించుకోవడం అవసరం.

లూప్ ఎంత కాలం ఉంచుకోవచ్చు  ?

లిప్పీస్ లూప్‌ని ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. కాని ప్రతి రెండు మూడు సంవత్సరాలకొకసారి అయినా పాత దానిని తీసివేసి క్రొత్తది వేయించుకోవడం మంచిచి. ఎందుకంటే లూప్ కొంతకాలంపాటు గర్భాశయంలో ఉన్న తరువాత అది గర్భాశయం లోపలి పొరల్లో పాతుకునిపోయే ప్రమాదం ఉంది దానివల్ల లూప్ వేయించుకున్నా ప్రయోజనం ఉండదు. వీరిలో లూప్ ఉన్నా గర్భం వచ్చే అవకాశం వుంది.