Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్దతులు 45

లూప్ నే "ఇంట్రాయుటెరైన్ కాంట్రాసెప్టెల్ డివైస్" అని అంటారు. ఐ. యు. సి. డి. అన్నా, ఐ. యు. డి. అన్నా లూప్ వంటి గర్భనిరోధక సాధనాన్నే

లూప్‌లో రకాలు

ఈనాడు బారతదేశంలో రెండు రకాల లూప్‌లు "ఐ.యు.సి.డి" వాడకంలో ఉన్నాయి.

1.ఔషధ రహిత (అన్ మెడికేటెడ్) లూప్

2.ఔషధ పూరిత (మెడికేటెడ్) లూప్

మళ్ళీ ఔషధ రహిత లూప్‌లో రెండు రకాలు వాడుకలో ఉన్నాయి. అందులో ఒకటి లిప్సీస్ లూప్,రెండవది - సూన్ వాలా లూప్.

ఇక ఔషధపూరితె లూప్‌ల్లో "కాపర్-టి","మల్టి లోడ్ కాపర్ 250" లూప్‌లు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి.

భారతదేశంలో లిప్సీస్ లూప్‌లు తయారు చేయబడుతున్నాయి. "కాపర్ - టి 209" లూప్ లు విదేశాలనుంచి దిగుమతి చేయబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడబడుతున్నాయి. "మల్టీలోడ్ సి.య 250" లూప్‌లు మార్కెట్టులో కొనడానికి లభ్యమవుతాయి. "మల్టీలోడ్ సి.యు. 250" లూప్ ఖరీదు వందరూపాయలకు పైగా ఉంటుంది. కాపర్ టి లూప్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వేస్తారు.