Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 38

గదు. ఈ బిల్లలు వాడటం మానివేసిన 3 నెలల్లోనె నూటికి 98 మంది స్త్రీలలో అండం విడుదల మామూలుగానే జరుగుతుంది. గర్భం మామూలుగానే వస్తుంది. ఒకవేళ ఇది వరకు సరిగ్గా బహిష్టులు రాని స్త్రీలుగాని, అండం విడుదల నెలనెల రాని స్త్రీలుగాని ఉన్నట్లయితే నోటిమాత్రలు కొన్ని నెలలు వాడినపుడు బహిష్టులు అయి పిమ్మట రెగ్యులర్‌గా నెలనెలా రావడం, అండం విడుదల సక్రమంగా అవడం కూడా జరుగుతుంది.

ఎక్కడో కొందరిలో ఈ బిల్లలు వాడడంవల్ల కొద్ది పాటి చెడు ఫలితాలు కనబడతాయి. కొద్దిగానో, కొంత ఎక్కువగానో బాధలు కనబరిచేవాళ్ళు 5-25 మంది ఊంటారు. వీళ్ళు కూడా మాత్రలు మ్రింగడం మానివేసిన తరువాత మామూలు అయిపోతారు.

ప్రపంచం మొత్తం మీద 50 మిలియన్లకి పైగా స్త్రీలు గర్భనిరోధక నోటిమాత్రలు రెగ్యులర్‌గా వాడుతున్నారు. మన దేశంలో స్త్రీలు నోటిమాత్రల వాడకం విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా గ్రామిణ స్త్రీలు ఇందుకు ముందుకు రావడంలేదు. దానికి కారణం సరైన విద్య, విజ్ఞానం లేకపోవడమే.

నోటిమాత్రలు వాడే స్త్రీలకి గర్భం రావడం అరుదు. ఈ బిళ్ళలు వాడే స్త్రీలలో 1-2 శాతం మందిలో గర్భం రావడం జరుగుతూ ఉంటుంది. * * *