పుట:KutunbaniyantranaPaddathulu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 37

వాలి. అంతేగాని ఉదయం వేసుకున్నాం కదా అని రాత్రి మానకూడదు. అలాగే ఈరాత్రికి మా శ్రీవారు లేరుకదా అని బద్దకం వేసి మాత్ర మింగడం మానకూడదు.

ఒకవేళ మాత్ర వేసుకోవడం వరసగా రెండురోజులు మరచిపోతే మూడవరొజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడటమే కాకుండ, ఇక ఆ రోజునుంచి మాత్రం కోర్సు పూర్తి అయ్యేవరకు ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే యోనిలో పెట్టుకునే ఫోమ్స్, బిళ్ళలు, పురుషుడు నిరోధ్ వాడటం వంటివి, వరుసగా రెండురోజులు మాత్రలు వాడుతున్న మధ్యకాలంలో మాత్రలు వేసుకోవడం మరిచిపోతే గర్భం రాకుండా ఇక ఆ నెలకి ఆ మాత్రలు శక్తివంతంగా తోడ్పడలేకపోతాయి. అందుకనే వాటికి తోడు ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని సూచించేది.

గర్భనిరోధక మాత్రలు - అంగవైకలం

గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలకి తరువాత సంతానంకలిగితే ఆ సంతానానికి అంగవైకల్యం వస్తుందేమో ననే భయం కొందరిలో ఉంది. నోటిమాత్రలు వాడడంవల్ల తరువాత పుట్టే బిడ్డకి అంగవైకల్యంరాదు. అలాగే నోటి మాత్రలు వాడడంవల్ల సంతాన సాపల్యత తగ్గిపోవడం జర