కుటుంబ నియంత్రణ - పద్ధతులు 26
వుంటుంది. అంతెకాకుండా ఈ హర్మోన్లు ఫలితంగా అండాశయాలనుంచి ఈస్ట్రోజన్, ప్రొజస్టిరోన్ హార్మోన్లు త్రయారవుతూ వుంటాయి. ఒకవేళ స్త్రీ గర్భవతి అయినట్లయితే అండాశయంనుంచి విడుదలవుతున్న ప్రొజస్టిరోన్ హార్మోను యెక్కువ మోతాదులో తయారవడము ప్రారంభం అవుతుంది. ఈ ఎక్కువగా తయారయ్యే ప్రొజస్టిరోన్, అక్కడనుంచి తయారయ్యే ఈస్ట్రోజన్ కలిసి పిట్యూటరీ గ్రంధి నుండి అండాశయాలను ఉత్తేజపరిచే హార్మోన్లను తయారవకుండా చేస్తాయి. దాని ఫలితంగా అండాశయాల నుంచి గర్బీణీస్త్రీలో మరొక గ్రుడ్డు విదుదలయ్యే అవకాశం వుండదు. ఈ విషయాన్నే శాస్త్రజ్ఞులు గుర్తించి స్త్రీ బహిష్టు అయిన అయిదవ రోజునుంచే ఎక్కువ మోతాదులో ఈష్ట్రొజన్, ప్రొజస్టిరోన్ మాత్రల రూపములో యివ్వడము జరిగింది. ఈ విధముగా ఈ రెండు హార్మోన్లు గ్రుడ్డుని తయారుచేసే హార్మోన్లను పిట్యూటరీ గ్రంధినుంచి వెలువడకుండా నిరోధించివేస్తాయి. అంతే కాకుండా గర్భనిరోధక మాత్రల ద్వారా యిచ్చే ప్రొజిస్టిరోన్ వల్ల గర్భాశయము కంఠం దగ్గర వుండే పచ్చని పొరదళసరిగా మారి గర్భాశయములోనికి వీర్యకణం ప్రవేశానికి అవరోధము కలిగిస్తుంది. అంతే కాకుండా గర్భాశయము లోపలిపొరను అండము పొదగబడటానికి అనుకూలంగా లేని స్తితిలో ఉంచుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో అయినా అండము