పుట:KutunbaniyantranaPaddathulu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 27

తయారయి విడుదలయినా ఆండాశయములో అది పిండంగా ఎదగడానికి వీలులేకుండా అయిపోతుంది.

స్త్రీ బహిష్టు అయిన 5 వ రోజునుంచి రోజూ ఒక మాత్ర చొప్పున 21 రోజులు తీసుకోవాలి. 5వ రోజునుంచి అంటే ఎప్పుడు అని అనుమానము కలుగవచ్చు. స్త్రీబహిష్టు స్రావము కనబడినరోజు మొదటి రోజు క్రింద లెక్క కట్టాలి. అక్కడినుంచి లెక్కకట్టి అయిదవ రోజునుంచి గర్భనిరోధక మాత్ర ప్రారంభించాలి. గర్భనిరోధక మాత్ర ఒక నిర్ణీత సమయంలో రోజూ తీసుకోవాలి రాత్రిపూట మొదలెట్టినట్లయితే రాత్రిపూటే తీసుకోవాలి. ఒకరోజు రాత్రిపూట, మరొకరోజు మధ్యాహ్నము యిలా తీసుకోవడం సరయిన విధానము కాదు. రోజూ రాత్రిపూట భోజన్మము చేయగానే గర్భనిరోధక మాత్ర తీసుకోవడము మంచిది. ఆహారము తీసుకున్న తరువాత మాత్ర వేసుకుంటే కడుపులో వికారము కలగడము, తల తిరగడము లాటివి అనిపించవు. ఇలా 21 మాత్రలు వేసుకుని ఆపివేసిన 3 రోజుల్లో బహిష్టు స్తావము కనబడుతుంది. తిరిగి బహిష్టు స్తావము కనబడిన 5 వ రొజు నుంచీ గర్భనిరోధక మాత్ర తీసుకోవటము ప్ర్రారంభించాలి.

కొందరు స్త్రీలు తిరిగి అయిదవరోజునించి గర్భనిరోధక మాత్ర వేసుకోవడము మరిచిపోతూ వుంటారు. అటువంటి అవకాశము లేకుండా 28 మాత్రలు ఉండే ప్యాకెట్లు తయారుచేయబడివున్నాయి. ఈ 28 మాత్రలు ఉండే