3. గర్భనిరోధక మాత్రలు
శ్రీమతి ఉషారాణి ఒక కాలేజీలో లెక్చరర్. ఆమెను చూచి తక్కిన లెక్చరర్స్‌కి అసూయగానూ ఉంటుంది. ఆశ్చర్యంగానూ ఉంటుంది. కారణం ఆమె తన దాంపత్య జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడమే. వివాహమయిన నాలుగు సంవత్సరాలకు దాంపత్య జీవితపు తొలి దినాల్లోని ఆనందానుభూతిని ఎటువంటి బాదరబందీ లేకుండా అనుభవించింది. తరువాత పుట్టిన యిద్దరు పిల్లల్నీ ఎంతో ప్లానుగా పెంచింది. ఆ పిల్లల ఆరోగ్య విషయంలోను, ఆహార విషయంలోను యెంతో శ్రద్ధ వహించింది. ఇలా కాకుండా వివాహమనగానే పిల్లలుపుట్టి, వాళ్ళని సరిగ్గా పెంచలేక, పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరూలేక దాంపత్య జీవితపు ఆనందాన్ని అనుభవించలేని వాళ్ళు ఈ లోకంలో యెంతోమంది వున్నారు. ఇటువంటి స్త్రీలందరికీ సరయిన మార్గం గర్భనిరోధక మాత్ర.
సామాజిక అవసరాలకోసం చేసిన కృషిలో గర్భనిరోధక మాత్ర వైద్యశాస్త్రజ్ఞుల విజయం. 20 వ శతాబ్దపు ప్ర్రారంభంలో స్త్రీ సంక్షేమము కొరకు స్త్రీ స్వేచ్ఛకొరకు గట్టిగా పోరాడిన వాళ్ళలో మార్గరేట్ శానజర్ ఒకరు. ఏ