Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 23

1981-82 సంవత్సరాల్లో భారతదేశంలో 44 లక్షల మంది దంపతులు నిరోధ్ ద్వారా కుటుంబ నియంత్రణని పాటిస్తే, 1984 సంవత్సరం వచ్చేసరికి దానికి రెట్టింపు దంపతులు నిరోధ్ వాడటం చేస్తున్నారు. ఈ నాడు ప్రపంచంలో 40 మిలియన్లుకి మించి దంపతులు కుటుంబ నియంత్రణని పాటించడానికి నొరోధ్ వంటి సంతాన నిరోధక సాధనాన్ని వాడుతున్నారు. జపానువంటి దేశాల్లో దంపతులు ఆకర్షణీయంగా ఉండే రంగురంగుల నిరోధ్‌లు వాడుతున్నారు. ఈ రకంగా నిరోధ్‌వంటి ప్రాచుర్యం బాగా పెరిగింది.

నిరోధ్ వాడటం అతి తేలిక. చాలా క్షేమకరమైనది. ఏ విధంగానూ దంపతుల్లో ఏ ఒక్కరికీ అనారోగ్యాన్ని కలిగించదు. పైగా నిరోధ్ వాడకంవల్ల స్రీలకి గర్భాశయ కంఠానికి కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే భర్త పురుషాంగానికి ఉండే పాచి పదార్ధం స్త్రీ యోనిలోకి ప్రవేశించదు. (పాచికి కేన్సర్‌ని కలిగించే గుణం ఉందనే సిద్ధాంతం ఉంది కదా).

అరుదుగా కొందరు దంపతులకి నిరోధ్ రబ్బర్ ఎలర్జీ కలిగించవచ్చు. అలాగే నిరోధ్‌ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నా వందమందిలో 6-10 మంది దంపతులకి గర్భంవచ్చే అవకాశం ఉంది. దానికి కారణం అది జారిపోవడమో, చిల్లు ఉండడమో, అయితే ఫోమ్ బిళ్ళలతో పాటు ఇది వాడితే ఆ అవకాశం కూడా లేదు.