పుట:KutunbaniyantranaPaddathulu.djvu/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 208

ఆందోళన“ అనే క్లాజు ప్రకారముగానే గర్భస్రావము చేయించుకోవాలి.

గర్భస్రావం - గర్భనిరోధక మాత్ర!

ఎవరైనా వివాహిత స్త్రీ తాను గర్భనిరోధకమాత్ర వేసుకుంటున్నా గర్భము వచ్చిందని, ప్రభుత్వంవారు కుటుంబ నియంత్రణ కావాలంటున్నారు. కనుక తనకి గర్భస్రావము చేయమని అడిగితే చట్టప్రకారముగా ఆస్త్రీకి గర్భస్రావము చేయడానికి అవకాశములేదు. ఎందుకంటే చట్టములో కుటుంబ నియంత్రణ పద్దతుల్లో ఒక్కటిగా గర్భస్రావాన్ని పొందుపరచలేదు. కాని ఆస్త్రీ గర్భ నిరోధక మాత్రలు వాడినా గర్భము వచ్చింది ఎలాగ అని మానసికంగా కృశించిపోయేటట్లయితే ఆమానసిక కారణము మీద ఆమెకు గర్భస్రావము చేయవచ్చు. అలాగే ఒక అవివాహిత స్త్రీ తాను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా గర్భమువచ్చిందని వాపోతే మాత్రము డాక్టరు గర్భస్రావం చేయవచ్చు. ఇక్కడ గర్భ నిరోదక మాత్రల గురించికంటే ఆమె మానసిక వేదన ముఖ్యం గనుక, ఆమె అసలు కారణం చెప్పినా, ఆమె వేదనని తీసివేయడానికి, గర్భస్రావం చేయడానికి చట్టం అంగీకరించింది.

కొన్ని ఇతర దేశాల్లో కుటుంబ గౌరవము నిలబెట్టడానికి, పిల్లలు ముగ్గురు - నలుగురికంటే ఎక్కువ వున్నారం