కుటుంబ నియంత్రణ - పద్ధతులు 207
మైన బిడ్డ పుట్టకపోవచ్చు. అందుకని యిటువంటిదానికి ఆస్కారం లేకుండా వుండడానికి చట్టములో గర్భస్రావానికి అంగీకరించడం జరిగింది. అయితే గర్భస్రావం చేయబోయే ముందు డాక్టర్ ఇందుకు తగిన ఆధారాల్ని చూపించాలి.
మానసిక ఆందోళన:_ ఒకవేళ ప్రస్తుతం వున్న కడుపు ఆస్త్రీకి అమితమైన మానసిక ఆందోళనని కలిగించినా, దానివల్ల మానసికంగా, శారీరకంగాకృంగికృశించిపోయేందుకు కారణభూతమయ్యేటట్లయితే డాక్టరు తగిన నిర్ణయం తీసుకొని గర్భస్రావము చేయవచ్చు. ఈ మానసిక ఆందోళన ఒకసారి వుండవచ్చు_ మరొకసారి లేకపోవచ్చు. కడుపు వున్నప్పుడు వుండవచ్చు, కడుపు తీసేసిన తరువాత లేక పోవచ్చు. కావాలనుకున్నప్పుడు వెంటనే నిర్దారణ చేసుకోవడానికి వీలులేనిది. అందుకని పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కానివాళ్ళు కానీ గట్టిగా గర్భం వద్దనుకున్నప్పుడు డాక్టరు ఈ మానసిక ఆందోళన అనే కారణము మీద గర్భస్రావము చేయడానికి అవకాశము లభించింది. అంతే గాని గర్భం వద్దనుకున్న ప్రతీ స్త్రీ అబార్షను చేయించుకోవడానికి అవకాశము కల్పించలేదు. అయితే ఈ మధ్య ఈ చట్టంలో చేసిన కొన్ని సవరణలలో కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో గర్భస్రావాన్ని కూడా ఒక పద్ధతిగా ఆమోదించడము జరిగింది. ఇక అవివాహిత స్త్రీలు, వితంతువులు గర్భం దాల్చడము జరిగితే వారు గర్భము మద్దనుకుంటే "మానసిక