Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 19

తెలియదు. ఈ నిరోద్‌నే రబ్బర్ అనీ, సేఫ్ అనీ, ఫ్రెంచి లెదర్ (యఫ్ యల్) అనీ. గర్భనిరోధక సాధనమనీ అంటారు. ఈ రోజుల్లో తయారయ్యే నిరోద్ లన్నీ పల్చగా మెత్తగా ఉండే రబ్బరుతో తయారుచేస్తున్నారు. జంతువుల చర్మంతో తయారయే నిరోధ్‌లు కూడా కొన్ని వున్నాయి. నిరొద్ ఒక అంగుళం వెడల్పు, ఏడు అంగుళాల పొడవు వుంటుంది. నిరోధ్ కూడా రబ్బరు బూర లాగానే గాలి వూదితే ఉబ్బుతుంది. నిరోద్ క్రింది భాగంలో చిన్న బుడగ లాగా ప్రత్యేకంగా వుంటుంది. సంయోగం సమయంలో విడుదలయిన వీర్యం ఇందులో వుండిపోతుంది. నిరోద్ పురుషాంగానికి తొడిగినప్పుడు జారిపోకుండా వుండటానికి దీని ముందు భాగములో దళసరిగా వుండే రబ్బర్ ఇలాస్టిక్ రింగ్ వుంటుంది. నిరోధ్‌ల్లో సైజులు వేరువేరుగా వుండవు. దీనికి సాగే గుణం వుంది. కనుక పురుషాంగంము ఏ పరిమాణము కలిగి వున్నా సరిపోతుంది. నిరోధ్‌లు ఒక్కొక్కటి వేరువేరుగా తగరపు కాగితముతో గాని, దళసరిఅట్టతోగాని చుట్టబడి వుంటాయి.

ఈనాడు నిరోధ్‌లు కుటుంబనియంత్రణకి వుపయోగిస్తున్నా మొట్టమొదట్లో ఎక్కువగా అక్రమ కామసంబంధాలకి, వేశ్యాసంపర్కమువల్ల వచ్చేసుఖవ్యాధులు రాకుండా వుండటానికి మాత్రమే వుపయోగించేవారు. కుటుంబనియంత్రణ సాధనాలలో ఒకటిగా ఇది ప్రచారము కలగడానికి కొన్ని ఆపోహలుకూడా అడ్దము వచ్చాయి. నిరోధ్ చాలా