పుట:KutunbaniyantranaPaddathulu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 20

సందర్భాలలో ఫేల్ అయిపోతుందనే దురభిప్రాయం వుంది. దీనికి కారణము సరిగ్గా దానిని వుపయోగించ లేకపోవడము లేదా పురుషుని నిర్లక్ష్యం. స్త్రీ గర్భవతి కాకుండా వుండాలంటే పురుషుడు జాగ్రత్తగా నిరోధ్‌వాడాలి. భర్త నిరోధ్ వాడతాడుకదా అని భార్య నమ్మి వూరుకున్నా, పురుషుడు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహిరించినా భార్యకి గర్భము రావడానికి ఆస్కారం వుంది. పైగా కొందరు పురుషులకు సహజరతికీ, నిరోధ్ వాడుతూ పాల్గొనే రతికీ చాలా తేడా కనబడుతుంది. నిరోధ్ వాడుతున్నప్పుడు కొందరికి రతిలో కలగలవసినంత తృప్తి కలగకుండా వుంటుంది. రతిలో తృప్తి కలగడం లేదని భావించి సరిగ్గా వీర్యస్థలనానికి ముందు నిరోధ్ వాడవచ్చని ఊరుకుంటారు. అటువంటప్పుడు ఒక్కొక్కసారి సంయోగంలో శీఘ్రస్థలనం అయి గర్భం రావచ్చు.

నిరోధ్‌ని వాడటం ఎలా ?

సంయోగంలో పాల్గొనబోయే ముందే నిరోధ్‌ని స్థంభించిన పురుషాంగానికి తొడగాలి. పురుషాంగం చివరి భాగాన్న నిరోధ్ ఒక అర అంగుళం పొడవు వదులుగా ఉంచాలి. అలా ఉంచటంవల్ల స్థలనమైన వీర్యం అక్కడే వుండిపోవటానికి వీలు కుదురుతుంది. నిరోధ్ స్తంభించిన పురుషాంగానికి తొడగబోయే ముందు శిశ్నంపైన ఆచ్చాదనగా వుండే చర్మాన్ని వెనకకులాగి తొడగాలి. సున్తీ