కుటుంబ నియంత్రణ - పద్ధతులు 189
దేరుతుంది. అండము వీర్యకణముతో కలయిక పొందిన తరువాత గర్భాశయానికి చేరడానికి మూడునుంచి నాలుగు రోజులు పడుతుంది. గర్భాశయంలోనే ఇది పెరిగి రకరకాలుగా మార్పులు చెందుతుంది. ఈ పిండము గర్బాశయానికి చేరేటప్పటికి గర్భాశయము క్రొత్త టిస్యూలతోను, క్రొత్తరక్తంతోనూ, సిద్ధంగా ఉండి పిండము ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కలిగించి ఉంటుంది. గర్భాశయానికి చేరిన పిండము గర్భాశయపు గొడలకి గట్టిగా అంటుకుని ఉండిపోయి, అక్కడే శిశువుగా పెరిగి చివరికి నెలలు నిండిన తరువాత జననము జరుగుతుంది.
అండం విడుదల
అండము విదుదలకి ఏదైనా నిర్ణీతమైన రోజు ప్రకారమే కాకుండా సమయం కూడా ఉంటుందా?
ప్రతీ స్త్రీలోనూ సాధారణంగా బహిష్టు రావడానికి పధ్నాలురోజులు ముందు అండము విడుదల అవుతుంది. అండము విడుదలనేది పగలు-రాత్రి అనే సమయంబట్టిగాని సంయోగము జరిగే సమయమునుబట్టిగాని ఆధారపడి లేదు. ఏ సమయములోనైనా అండము విడుదల అవవచ్చు. ఒకసారి విడుదలైన అండానికి ఇరవైనాలుగు గంటలు మాత్రమే వీర్యకణముతో కలయిక పొందే సామర్ధ్యము ఉంటుంది.