పుట:KutunbaniyantranaPaddathulu.djvu/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 188

నికి విడుదలయిన వీర్యకణములన్నీ పయనించి అండవాహికల్లోకి ప్రవేశించలేవు. చాలావరకు యోని మార్గంలోనే ఉండిపోతాయి. యోని మార్గంలోనే ఉండిపోయిన వీర్యం వీర్యకణములు ఏమయిపోతాయని సందేహం కలగవచ్చు. ఎక్కువభాగం వీర్యం రతి పూర్తి అవగానే పురుషాంగం బయటకు ఉపసంహరించుకునేటప్పుడు గాని, యోనిమార్గంలోని కండరాలు ముడుచుకొని పోబట్టిగాని బయటకు వచ్చేస్తుంది. కొంతభాగము యోని మార్గంలోనే వుండి వాతావరణము సరిపోక నశించిపోతాయి.

అండంతో వీర్యకణాల కలయిక

వీర్యకణం అండం కలయిక అండవాహికల్లో జరుగుతాయి. గర్భకోశంలో ఈ కలయిక జరగదు. అండానికి విడుదలయిన తరువాత ఒక రోజువరకే వీర్యకణంలో కలయిక పొంది పిండంగా మారే శక్తి ఉంటుంది. అండం విడుదలయి, ఆ అండం అండవాహికలద్వారా పయనించి గర్భాశయానికి చేరాలంటే చాలా రోజులు పడుతుంది. అసలు గర్భాశయానికి చేరకముందేఅండం తనశక్తిని కోల్పోతుంది. అందుకని అండం పిండంగా మారాలంటే అండవాహికల్లోనే వీర్యకణముతో కలయిక జరిగిన అండం పిండంగా మారి శక్తిని పుంజుకుంటుంది.

ఈ పిండము నిదానంగా గర్భాశయం వైపునకు బయలు