కుటుంబ నియంత్రణ - పద్ధతులు
183
అందరి విషయంలోనూ సరిపోదు. పదిరోజులకి-పదిహేనురోజులకి బహిస్టుస్రావం కనబడేవాళ్ళలోనూ 2, 3 వారాలకే బహిస్టు అయ్యే స్త్రీలలోనూ అండం విడుదల సరిగ్గా ఉండదు. ఉదాహరణకి 21 రోజులకి బహిస్టు అయ్యే స్త్రీలకి బహిస్టు ప్రారంభం అయిన 5వ రోజునుంచి 9వ రోజులోగా ఎప్పుడయినా అండం విడుదల కావచ్చు. అండం విడుదలకి 3 రోజులు ముందు వీర్యకణములు విడుదలై యోని మార్గంలో వున్నా అవి అండంతో కలిసే శక్తి కలిగి వుంటాయి, అందుచేత బహిస్టు అయినప్పుడు సంయోగం జరిగితే గర్భం రాదులే అని బహిస్టు స్రావం కనబడిన రెండవరోజుగాని, 3వ రోజుగాని రతిలో పాల్గొంటే గర్భం రావడానికి అవకాశాలున్నాయి. అలాగే ప్రతి 10 రోజులకి 15 రోజులకీ బహిస్టుస్రావం కనబడే వాళ్ళలో ఎప్పుడు అండం విదుదల అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి బహిస్టు స్రావం అని భావిస్తున్న దినాల్లో కూడా అండం విడుదల అవుతూ వుండవచ్చు. ఇలా అస్తవ్యస్తంగా బహిస్టు అయ్యేవాళ్ళల్లో కాకుండా 28 రోజూలకీ 30 రోజులకి బహిస్టు అయ్యేవాళ్ళల్లో మాత్రం బహిస్టు సమయంలో సంయోగం జరిగితే గర్భం వచ్చే ప్రమాదం ఉండదు.
స్త్రీలో కామోద్రేకం కలగపోతే గర్భంరాదా
కొంతమంది స్త్రీలు తాము రతిలో పాల్గొన్నప్పుడు కామోద్రేకం పొందకపోతే కడుపు రాకుండా వుంటుందని