పుట:KutunbaniyantranaPaddathulu.djvu/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు - 175

నెలలు నిండుతున్న కొద్దీ గర్భసంచిలోని బిడ్డ పెరగడం జరిగి డయాఫ్రమ్ పైకి నెట్టివేయడంవల్ల ఊపిరితిత్తులు నొక్కి వేయబడినట్లు అనిపిస్తుంది. దీనివల్ల గర్భిణిస్త్రీ గాలి పూర్తిగా పీల్చలేకపోవడం, ఆయాసపడటం జరుగుతుంది.

గర్భిణి స్త్రీలల్లో గర్భం వచ్చిన మొదటి 2, 3 నలల్లోనూ ఎక్కువసార్లు మూత్రవిసర్జన జరుగుతుంది. దీనికి గర్భం దాల్చినప్పుడు గర్భకోశం దగ్గర రక్తాదిక్యత కలగడం పెరుగుతున్న గర్భకోశం మూత్రకోశాన్ని నొక్కడం కారణాలు నాలుగవ నెల వచ్చేసరికి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం ఆగిపోతుంది. తిరిగి నెలలు నిండి కాన్పువచ్చే ముందు ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం జరుగుతుంది. దీనికి కారణం బిడ్డ తల క్రిందికి దిగుతూ మూత్రకోశాన్ని నొక్కి వేయడమే. కొందరి స్త్రీలకి మూత్రం పరీక్షచేస్తే మూత్రంలో షుగర్ కనబడుతుంది. గర్భిణి స్త్రీలకి మూత్రంలో షుగర్ కొద్ది మొత్తంలో లీక్ ఆవడం మామూలు విషయమే.

గర్భిణి స్త్రీలలో చాలామందికి నరాల బలహీనత కలిగి నట్లు అనిపిస్తుంది. కొంతవరకు దీనికి మానసిక వేదన కారణం. ఈ మానసిక ఆందోళనలవల్ల చికాకు, నిద్రలేకపోవడం, నిర్లిప్తత, అకస్మాత్తుగా ఆవేశం, ఉద్రేకం కలుగుతూ ఉంటాయి. ఈ మానసిక విపరీత పరిస్థితివల్లనే కొందరు