పుట:KutunbaniyantranaPaddathulu.djvu/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 138

కుంటూ వుంటారు. ఇటువంటివారు కాన్పు అయిన నాలుగు నుంచి ఆరు వారాలపాటు తిరిగి దాంపత్య జీవితం గడపడానికి ఆగడం మంచిది. మరికొందరు స్రీలు కాన్పుతో సంబంధం లేకుండా తరువాత ఆపరేషన్ చేయించుకుంటారు. ఇటువంటి స్త్రీలు ఆపరేషన్ చేయించుకున్న తరువాత ఎంతకాలం రతిలో పాల్గొనకూడదు అనే అనుమానం కలగ వచ్చు. కాన్పుతో సంబంధం లేకుండా ఆపరేషన్ చేయించుకొన్న స్త్రీలు కుట్లు ఊడతీసిన మరుసటి రోజునించి రతిలో పాల్గొనవచ్చు. లెదా వారం పది రోజులు ఆగవచ్చు. ఒక సారి ట్యూబులు ఆపరేషన్ చేసి కత్తిరించడం జరిగిన తరువాత అండం గర్భాశయానికి చేరడమనేది జరగదు. దీనివల్ల గర్భం వచ్చే అవకాశం లేదు. అయినా ఆపరేషన్ కదా. వెంటనే రతిలో పాల్గొంటే నష్టం రాదా అని అనుమానం కలుగవచ్చు. ట్యూబెక్టమీకి కడుపుమీద అంగుళం లేక రెండు అంగుళాలకంటే ఎక్కువ కొసేది ఉండదు. రతిలో పాల్గొన్నంతమాత్రాన అక్కడి ఒళ్ళు దెబ్బ తినడం కాని, తెగిపోవడంగాని జరుగదు. ట్యూబెక్టమీ చేయించుకున్న స్త్రీలు పది పదిహేనురోజులు తరువాత రతిలో పాల్గొనడమే కాకుండా ఇంట్లో మామూలుగా చేసుకునే వంట-వార్పూ తమంతట తాము నిర్భయంగా చేసుకోవచ్చు.