కుటుంబ నియంత్రణ - పద్ధతులు 137
మీద ఆధారపడి వుంటుంది. ఈ హార్మోన్లు తిన్నగా రక్తంలోకి ప్రవహించి తరువాత గర్భకోశం పొరల మీద తమ ప్రబావాన్ని చూపిస్తాయి. ట్యూబెక్టమీ ఆపరేషనులో కేవలం ఆ అండం ప్రయాణింఛే ట్యూబులని మాత్రమే మధ్యకి కత్తిరించి ముడి వేయడం జరుగుతుంది. దానివల్ల అండాశయంలో తాయారైన అండం గర్భాశయానికి చేరకుండా నిరోదింపబడుతుంది. అండాశయంలో తయారయ్యే హార్మోన్లు ఈ ట్యూబుల ద్వారా పయనించడమంటూ జరగదు. అటువంటప్పుడు ట్యూబెక్టమీ ఛేయడంవల్ల హర్మోన్ల ఉత్పత్తిని ఆటంకపరచడంగాని అవి గర్భాశయానికి చేరే మార్గాన్ని నిరోధించడమనే ప్రసక్తిగానీ లేదు. ట్యూబెక్టమీ చేసినా ఆండాశయాలు యధావిధంగా హార్మోన్లని ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. అక్కడ రక్తనాళాలు తమ లోకి ఆ హార్మోన్లని పీల్చుకుంటూనే ఉంటాయి. ట్యూబెక్టమీ చేయించుకున్న తరువాత ఎవరిలోనైనా బహిస్టులు అస్తవ్యస్తత కలిగితే వేరే యితర కారణాలవల్ల అవవలసిందే తప్ప ఆపరేషనువల్ల మాత్రంకాదు.
ట్యూబెక్టమీ సంయోగం
కొందరు స్త్రీలు కాన్పు అయిన మరునాడు కాని, తరువాత ఒకటి రెందు రోజులలోగాని ఆపరేషను ఛేయించు