కుటుంబ నియంత్రణ - పద్ధతులు 114
శయాల్ని ఎప్పటికీ పని చేయకుండా అణచివేస్తున్నారు. దీనివల్ల ఇక గర్బం రావడం కాని, బహిస్టులు కలగడంగాని ఉండవు.
ట్యూబెక్టమీ ఆపరేషను బదులుగా డీప్ ఎక్స్‌రే పెట్టించుకోవచ్చా?
ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్స్ రే ట్రీట్ మెంటు పూర్తిగా తప్పుపద్దతి, డీప్ ఎక్స్‌రేగాని, రేడియం సూదులు గాని, కోబాల్టు ట్రీట్ మెంటుగాని ఏవి అయినప్పటికీ అవన్నీ కేవలం కేన్సర్ వచ్చినప్పుడు చికిత్సగా ఉపయోగించవలసిందే తప్ప, ఆరోగ్యకరంగా ఉండే టిస్యూలోని శరీరభాగాలని మాడ్చివేయడానికి ఏ మాత్రం ఉపయోగించరాదు. ఒక సీనియర్ రేడియాలజీ ప్రొఫెసరు ఈ విషయంపై స్పష్టంగా వివరించి చెబుతూ డీప్ ఎక్సరే చికిత్సని కుటుంబనియంత్రణ ఆపరేషన్లకి బదులుగానూ, అబార్షనులు అయ్యేటట్టు, బహిస్టులు పూర్తిగా లేకుండా చేసేటట్లుగానూ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. వీటికొరకు డీప్ ఎక్సరే ఉపయోగించడంవల్ల వచ్చే మామూలుగా కలిగే బాధలు అటుంచి, కేన్సర్ లేనివారికి కేన్సర్ కలిగేటట్లు చేయడమవుతుందని వివరించారు.