పుట:KutunbaniyantranaPaddathulu.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12 నూతన గర్భనిరోధక పద్ధతులు

కుటుంబ నియంత్ర్రణ కొరకు రోజూ మాత్రలు మింగుతున్న సంధ్యకు కొన్ని రోజులయ్యేసరికి వాటిని గుర్తువుంచుకుని వేసుకోవాలంటే విసుగుగా అనిపించడం జరుగుతోంది. దానికి తోడు అవి వేసుకుంటే కడుపులో త్రిప్పినట్లు, కాళ్ళు పీకినట్లుగా వుండటంతో మాత్రలు మింగడానికి విరక్తి కలుగుతోంది. అందుకని ఓ సంధ్యా సమయాన సంధ్య డాక్టరు దగ్గరికి వెళ్ళి "డాక్టర్, రాత్రి అవుతోందంటేనే మాత్ర గురించి గుర్తు పెట్టుకోవడం, అది మింగి బాధ పడడం తప్పడం లేదు. ఇలా బాధపడకుండా ఇంకా తేలికైన పద్ధతులు కొత్తవేమీ కనిపెట్టలేదా?" అంటూ ప్రశ్నించింది.

సంధ్య అడిగిన దానిలో తప్పేమీ లేదు అందుకనే రోజురోజుకీ కుటుంబనియంత్రణ పద్ధతుల్లో తేలికగా అమలు పరచగల వాటి గురించి పరిశోధనలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మార్కెట్టులో లభ్యమవుతున్న కుటుంబ నియంత్రణ మాత్రల్లో ఈస్ట్రోజన్ - ప్రొజస్టిరోన్ హార్మోన్లు రెండూ కలిసి వుంటున్నాయి. వీటిలో ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉండబట్టే కడుపులో వికారం, కాళ్ళతీపులు మొదలైన