పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి.

అప్పటివర కింకను ప్రబలరాజ్యములు దుర్భల రాజ్యములనుండి కప్పముల గొనుటతోనే తృప్తినొందియుండెను. రాజ్యములను విశాలము చేసికొను నాచారము వాడుకలోకి వచ్చియుండలేదు.

   అయినను, అప్పటికి రజసత్తాకపద్దతిమాత్రము సంపూర్ణము గాను నిరంకుశముగాను వ్యాపించియుండెను. వెనుకమేము చెప్పిన ప్రకారము ప్రజాసత్తాకపద్దతియు ప్రజతో నాలోచించి పరిపాలనజేయు పద్ధతియు, అచ్చటచ్చటా నుల్లేఖింప బడియున్నను, మొత్తముమీద వీరకావ్యములం దెచ్చటజూచినను రాజు నిధికరం ఎదుగులెనిది గాను, ప్రజల విధేయులజేసికొను నధికారము రాజునకు దైనదత్తముగాను ప్రశంసింపబడియున్నది. "రాజునకిట్టి యధికారమెట్లువచ్చె" నను ప్రశ్నకు తమయిచ్చ వచ్చినట్టు సమాధానము చెప్పుకొనిరి. అయినను రాజునకు గొన్నికర్తవ్యములు  కలవనుమాటమాత్రమువారు మరచిపోలేదు. శాంతిపర్వములోని రాజధర్మవివరణమున, ఆరంభముననే యుదిష్టిరుడు భీష్ము నడుగును. "రాజశబ్దమెట్లువచ్చినది? తక్కిన యందరివలెనే రెండు చేతులును రెండు కన్నులును కలిగి వారితో తుల్యమగు జ్ఞానమును మాత్రమేకల మనుష్యునికి తక్కినవారిని పాలించు నధికారమెట్లువచ్చెను?" దీనికి భీష్ముని ప్రత్యుత్తరమిది. "కృతయుగమున రాజేలేడు. ఆకాలమున జనులందరు స్వతంత్రులయి ధర్మమును తామే నడపుచుండిరి. తరువాత మనుజులు క్రామక్రోధాదులకు వశులై అధర్మ మార్గానువర్తులై పాప కార్యములజేయసాగిరి. పాపము మిక్కుటమగుటవలన దేవతలకు