పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

ధరింపబడుచుండెననియు, మొలనూలువంటి దేదియు నుండలేదనియు, ఇప్పుడు ఉత్తరహిందూస్థానమునందు వాడుకలోనున్న లంగావంటిదానిని వారు తొడుగుకొనుచుండలే దనియు తేలుచున్నది లంగావంటి వస్త్రమేయైనయెడల నంత యవలీలగా నూడియుండునా? ఆ కాలమున రవికయనబడునదికూడ నుండలేదని తోచుచున్నది.

   ఈ సందర్భమున నొక చిత్రము చూడదగియున్నది. పురాతన కాలపు గ్రీకు స్త్రీ పురుషులు ధరించుచుండిన యదువులను హోమరు వర్ణించియున్నాడు. అవి మన హింద్వార్యుల వస్త్రములను బోలి యున్నవి. హోమరు కాలపు స్త్రీ ముసుకుగాక ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగలట్టిదియు దేశములోనే తయారయినట్టియు కత్తిరింపువాని కుట్టుపనిగాని లేనట్టిదిల్యు నగు నొక వస్త్రమును గట్టుకొనుచుండేను; ఆ వస్త్రము భుజముపైన నొకసూదితోను నడుముచుట్టు మొలనూలుతోను బిగింపబడుచుండెను; చేతులు బయటనే యుందుచు వచ్చెను". ॥ పురుషులకు మొలనూలు ఉండలేదు. పైన నుల్లేఖింపబడిన ముసుకు హిందార్యస్త్రీల యుత్తరీయమువంటిదే యని వేఱుగా జెప్పబనిలేదు. "హోమరుకాలపు స్త్రీదు:ఖసమయములందును, స్వతంత్రముగా నేదయన పని చేయవలసివచ్చినప్పుడును, ముసుకునుతీసి వేయుచుండెడిది"  సీత తన్ను పరుడోకడు బలాత్కారముగా చెఱగొని పోవునపుడు ఆసమాచారము భర్తకెఱుక పఱచు నుద్దేశముతో దన యుత్తరీయమును వానరసేనారీనృ

_______________________________________ ॥ Women of Homer by Walter Capt.Perry.