పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారియుడుపులు.

7

తుదకు సుగ్రీవుడుండిన ఋష్యమూకముపైన బడవైచెను. కనుక హింద్వార్యస్త్రీయును హోమరునాటి స్త్రీయును ఉత్తరీయము నొక్కొక్కమారు వదలివేయచుగూడ నుండ్రి. హిందూస్త్రీవలెనె హోమరుని స్త్రీకిగూడ కంచుకముండలేదను సంగతి హోమరు వర్ణనములవల నేమి పురాతన గ్రీకుల విగ్రహము లవలననేమి మనకు దెలియుచున్నది.

     దక్షిణహిందూస్థానమున నిప్పుడు వాడుక యందున్న గోచీ పెట్టుకొనుపద్ధతి ఆ కాలమున లేదని తోచుచున్నది. గోచీ పెట్టుకొని నాచారము స్త్రీలళొ నాకాలమున నుండినయెడల ద్రౌపది కట్తు పుట్టము దుశ్శాసను డట్లు ఊడగుంజుటకు వీలులేక యుండును. మహాభారమునం దెచ్చటను నీగోచీమాట రానేలేదు. బాలురకు ఉపనయన సమయమున కౌపీనము పెట్టించుపద్ధతి ననుసరించియే స్త్రీలలో నిట్టి యాచారమారంభమై యుండవచ్చును. పురుషులకు ఉపనయనమెట్టిదో స్త్రీలకు వివాహ మట్టిదగుట చేతనే కాబోలును వివాహితలయిన స్త్రీలవిషయమున మాత్రమే గోచీపద్ధతి విధింపబడియున్నది.  దక్షిణహిందూస్థాన మందు సయితము కన్యలుగోచీలేకుండనే బట్టగట్టుకొనుచున్నారు. క్షాత్రల్యుగమున నుత్తరీయమును గౌరవనీయురాండ్రు మాత్రమే ధరించుచుండిరి.  కావుననే ద్రౌపది సైరంధ్ర్రివేషముతో విరాటుని పురమున నుండినపుడు ఏకవస్త్రముగనే సుధేష్ణయెద్దకు వచ్చినది. X బహిష్టులుగా నున్నపుడుకూడ స్త్రీలకు ఉత్తరీయముతో  బనిలేకయుండెను. ఇంట గృహకృత్యములను నెరవే

________________________________________ X వాసశ్చపరిధాయైకం కృష్ణానుమలినం మహత్ కి విరాటహేక్షిణ