పుట:Krxshhiivaludu (1924).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్‌ రాదు, శు
ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె, దీవ్రంబుగా
సోకెన్‌ సూర్యమయూఖతాప, మిఁక నేజోకన్‌ ఫలించున్‌ వరుల్‌
మాకీకష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్‌? 84

కఱకుగ నెండగాయ నిక గాసముతప్పె ననంగ నేల? భా
స్కర కిరణాళిలో గలదు సస్యసముద్ధరణైకశక్తి; త
త్కిరణము లబ్ధివారి పయికింగొని యావిరిరూపునన్‌, నభోం
తరమున మార్చు నీరద వితానముగాగ బునప్రవృష్టికిన్‌. 85

అల వర్షాగమలక్ష్మి రేఖ యన దివ్యానేక వర్ణంబులం
బొలుపుంబొందు నవాబ్దమాల యదిగో భూభృచ్ఛిరోలంకృతిం
దలపించుం గనుగొమ్మ, వాయునిహతిం దద్దేశముం బాసి కొం
గలబారుల్‌ వెనువెంట నంట శకలాకారంబులన్‌ వచ్చెడిన్‌. 86

బావికి నీటికై యరుగు పల్లెత లంబుధరంబు గాంచి య
ప్పా! వినువీథి హాలికులపాలిటి దైవమె యంబుదాకృతిన్‌
భావిఫలోదయప్రకటభావమునం జనుదెంచె నంచు మో
దావృత చిత్తలై సరసమాడుచు బోయెదరో కృషీవలా. 87

పొలమున కంచెగా మొలచి పువ్వులుపూచెడు కేతకంబు లు
జ్జ్వల కుసుమోపహారముల బత్రపుటంబుల నుంచి మారుతా