పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19


బాపట్ల శతావధానము

పీఠిక

ఆర్యులారా!

శ్రీమదాశుకవిసింహేత్యాది బిరుదాంచితులైన బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకట సుబ్బరాయ వేంకట రమణాభిఖ్యాతి విఖ్యాతకవిపుంగవు లీనెల 14వ తారీఖున మా బాపట్ల పురవాసులును విద్యాభిమానులును నగు బ్రహ్మశ్రీ చోరగుడి వేంకటాద్రిగారును, బ్రహ్మశ్రీ రాచపూడి జగన్నాథరావుగారును, బ్రహ్మశ్రీ పాతూరి శివరామయ్యగారును, బ్రహ్మశ్రీ కోన వెంకట్రావుగారును, బ్రహ్మశ్రీ ఆలూరి గోపాలరావు గారును, బ్రహ్మశ్రీ వల్లూరి వేంకటరామయ్యగారును, బ్రహ్మశ్రీ కొమరవోలు హనుమంతరావు గారును, బ్రహ్మశ్రీ చెంచురామయ్యగారును, బ్రహ్మశ్రీ కోటేశ్వరరావుగారును, బ్రహ్మశ్రీ బ్రహ్మాండం బాపయ్య గారి గుమస్తాగారగు బ్రహ్మశ్రీ గోపాలరావుగారును, బ్రహ్మశ్రీ కర్లపాలెపు సూర్యనారాయణగారును, బ్రహ్మశ్రీ పెళ్లూరి శ్రీనివాస కవిగారును మఱియు ననేకులగు మహామహులును సముచితంబుగ నాహ్వాన మొనర్ప నంగీకరించి వచ్చి, మా బాపట్ల రైలు స్టేషను లోనికిఁ బ్రవేశించు వఱకుఁ దద్దర్శనోత్సాహ వర్ధిష్ణులైన జనులనేకులు కరతాళ ధ్వనులొనర్చుచు జయజయేతి శబ్దంబులచే నుతియించుచు స్వాగత పద్యంబు లొసంగి యశ్వ శకటాధిరోహులఁ గావించి యూరేగించి సభా భవనమునఁ బ్రవేశపెట్టిరి. సభ యందు నిండియుండిన పండిత పామరులందఱొక్కసారిగాఁ గరతాళ స్వనంబులచేఁ దమ సంతోషంబును దెలిపిరి. ఆనాఁటి సభయందగ్రాసనాధిపతులుగా కోర్టు మునసబు గారైన బ్రహ్మశ్రీ టి. భుజంగరావు పంతులుగారుండిరి. ఈ కవి ద్వయము సభ్యులచే నెఱిఁగింపఁ బడిన కథా విషయంబుల నగ్రాసనాధిపతి గారు కోరఁగాఁ దమ నిరుపమానమగు నాశు కవితా ప్రభావంబుచే నక్కథలను బూర్తియొనరించి యెల్లర హృదయంబు లమందానంద కందళితంబులుగా సల్పిరి. ఇతఃపూర్వ మెన్నఁడును నెచ్చటను గని విని యుండని వారి యత్యద్భుత కవితాధారచేఁ దనిసి మెచ్చి తలయూపనివారు కానరారైరి. మఱునాఁడు 15వ తేదీన (15-9-1911) మధ్యాహ్నము సుమారు