పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శతావధానములు

సంగంజాగర్లమూడి శతావధానము

పరిచయము

సుప్రసిద్ధ కింకవీంద్ర ఘటాపంచాననాది బిరుదాంకితులగు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవిద్వయము దేశ దేశాలు తిరుగుచు నానా రాజస్థానములను దర్శించుచుఁ దమపాండిత్య గరిమచే నవధానము లద్భుతముగాఁ జేయుచున్న కాలమది. “ఒక చరణం బతండు మఱి యొక్కటి నేను మఱొక్కటాతఁడున్ సకల కవీంద్ర బృందములు సన్నుతి సేయఁగ” అని చెప్పికొని యిర్వురు నవధానమున వీరవిహారము సలుపుచు సామాన్య జనులకు సైతము పరమానందముఁ గూర్చు శైలిలో పద్యములాశువుగా వచించుచు మెప్పందుచుండిరి.

వీరికి దీటుగా రాఁగలిగిన కవీంద్రులున్నారా? యని సంచరించు కాలములోఁ గొప్పరపు సోదర కవులు ప్రాముఖ్యతకు వచ్చిరి. ఆ కాలపు వైదిక నియోగి? భేదములలోఁ గొందఱు వారిని గొందఱు వీరిని నభిమానించుచున్నను మొత్తముమీఁద సారస్వత ప్రోత్సాహమునేయిచ్చి సత్కరించు చుండిరి. ఆంధ్ర దేశములో నవధానములపుడు మెండుగా జరిగెను. ఈ యవధానములు పండిత కవీంద్రుల ధారణ శక్త్యాదుల నచ్చెరువుఁ గల్గించుచు సభాసదులకు ముదము గూర్చును.