పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
289

నాఁడు కొప్పరపు సోదరకవుల యాశుకవితామృతము నాస్వాదించి సంతోష పారావార తరంగంబుల నుయ్యాల లూఁగిన పండిత పామరులెంద̃ఱో గలరని చెప్పుటకు వారి శతావధానములందలి పండితకవీంద్రుల ప్రశంసా పద్యములే సాక్షి. నాఁటివారిలో నే నొకరుండనై యుండుట నాయదృష్టము,

వర్తమాన భవిష్యత్కాలములలో సకలజను లీ గ్రంధమువలన సోదరకవుల యాశుకవితామృతమును జవిచూచి యానందాబ్ది నోలలాడఁ గలరని చెప్పుట కెట్టి సందియము లేదు.

నా సంకల్పమును దెలిపినంతనే ధనమిచ్చి తోడ్పడిన అభిమానవంతు లందఱకు నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు,

నే నభ్యర్థించినంతనే తమ పనులన్నియు మానుకొని ముద్రణస్థాలిత్యముల నప్పటికప్పుడు సవరించి యిచ్చుచు నాభారమును తగ్గించిన తెనాలి తాలూకా జూనియర్ కాలేజి రిటైర్డు సీనియర్ తెలుఁగు పండితులు ఉభయభాషా ప్రవీణులు నైన బ్రహ్మశ్రీ పులిగడ్డ వేంకట సుబ్బారాయ ప్రెగ్గడపుంగవులకు నా హృదయపూర్వక ఆశీశ్శతంబులు.

పెనుగుదురుపాడు

ఆనంద సంవత్సరాది

24-3-1974

ఇట్లు,

ముద్రాపయిత

కుంటముక్కల వేంకట జానకీరామశర్మ