పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

స్థిరతన్ సత్కవి సార్వభౌముఁడగు నా శ్రీనాథుఁడేసీమఁ గా
పురమున్ జేసెనొ యందె మీరు జననంబున్ బొందుటట్లే కవి
త్వ రసజ్ఞత్వముచేత మించు టరయన్ ద్వైరూప భావంబునన్
ధరపై నాతఁడే మీరలై జననమందంబోలు నంచెన్నెదన్

నాటికిన్నేఁడు మనకొండ వీటిసీమ
కడుపుచల్లఁగఁ గన్నదీ కవుల కాన్పు
నాదు కొడుకులె కవులంచు నవ్వు కోన
సీమ పెద్దఱికంబింకఁ జెల్లనీదు

అలరుం దేనియ సోన లుట్టిపడునట్లల్లారు ముద్దారఁగాఁ
బలుకన్నేరిచి బ్రౌఢనిర్భరవయః పాకంబునన్ జాతి వా
ర్తలచే నూత్నచమత్క్రియాకలనచే రాణించు మీకావ్యపుం
జెలికై యువ్విళులూరుచుంద్రు రసిక శ్రేష్ఠుల్ విమోహంబునన్

చేరువనుంటచే బెరటి చెట్టది మందునకేలవచ్చు నం
చూరక లోకమాడుకొనునుక్తియథార్ధము గానిమాటయం
చీరహిఁ జాటినట్లు, జనియించితి రెచ్చట నచ్చటే ప్రశ
స్తోరు యశంబుగాంచితి రహో యిదిదుర్లభ మెంతవారికిన్

సరసకళానిబంధన లసద్రసవాక్కృతిమత్ప్రబంధ బం
ధురసదలంక్రియా నిచయధూర్వహ గీర్వనితా విపంచికా
దర సువికస్వర స్వరవిధాన సుధారసమాధురీ ధురం
ధర బహుళప్రబంధ కవితావనితావినుతావదాత వి
స్ఫురిత భవద్యశఃపటలి పొల్పువహించుత నక్షరస్థితిన్

అరవిరి జాజిపూ సరుల నల్లినరీతిఁ
          దియ్యంపుఁబలుకుఁ బొందిక లమర్చి