పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ 'లక్ష్మీ' నారాయణునికి,
సరస్వతీ' పరాయణునికి,
కృతజ్ఞతాభి వందనాలు,
అభినందనలు.

“కొప్పరపు సోదరకవుల కవిత్వము” పుస్తకానికి “పీఠిక” వ్రాయటమంటే అవధాన సరస్వతీపీఠానికి ప్రార్థనాగీతం ఆలపించటంలా భావిస్తాను. ఏ పూజఫలమో! ఏదేని వరమో! ఈనాటి భాగ్యంగా భావిస్తాను.

జంటకవులుగా, అవధానకవులుగా, ఆశుకవులుగా తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులు, వేంకట రామకృష్ణ కవులు పాండితీ లోకానికి చిరపరిచితులు, స్థిరపరిచితులు. కొప్పరపు సోదరకవుల ఆశుకవిత్వం ఆద్వితీయమని అందరికీ తెలిసినా, ఆప్రవాహ వేగం, ఆ సాహితీ సారం, ఆ అవధాన యాగం, యోగం చాలా వరకూ పూర్తిగా తెలియదు. ఎందుకంటే వీరి విషయాలు గ్రంథ రూపంలో ఎక్కువగా లేకపోవడం, సాహిత్య చరిత్ర పుస్తకాల్లో సహితం వీరిగురించి చాలా తక్కువగా స్పృశించి ఉండటం.... 'కొప్పరపు సోదరకవులు' కొన్ని వందల అవధానాలు చేసి, లక్షల పద్యాలు ఆశువుగా చెప్పి, ఆశువుగా ప్రబంధాల నిర్మాణం చేసి, ప్రబంధస్థాయి వర్ణనలతో సంపూర్ణ శతావధానాలు నిర్వహించి, నాటకాలూ, కావ్యాలు వ్రాసినా... అవన్నీ కాలగర్భంలో కలసిపోగా, వీరి అవధానాలు ఆశుకవిత్వ సభలలోని కొన్ని వర్ణనలు సమస్యాపూరణలతో కూడిన కొన్ని వందల పద్యాలు మరియు ఆనాటి (ఏనాటికీ) మేటి పండితుల ప్రశంసల కలయికగా ఏర్పడిన ఈ పుస్తకం సాహితీ జిజ్ఞాసువులకు కొంత సేద తీరుస్తుంది; వీరిని గురించి తెలియని వారికి ఒక మార్గం ఏర్పరుస్తుంది. ఈ సేద తీరడం వెనుక, కుంటముక్కల వేంకట జానకి రామశర్మ గారి 'స్వేదం', శ్రీ లక్ష్మీనారాయణ గారి 'జీవనాదం' ఉన్నాయి. ఈ స్వేదనాదాలే నిర్వివాదంగా భావివేదాలు అవుతాయి.

32వేల సంకీర్తలు వ్రాసిన 'పదకవితా పితామహుడు' అన్నమయ్య, ఐదు తాళాలను ఒకేసారి ప్రదర్శించిన 'సకలకళాసమ్రాట్' ఆదిభట్ల నారాయణదాసు, 'భారతీయత'ను ఖండాంతర వ్యాప్తి చేసిన స్వామి వివేకానంద, నడుస్తున్న

xxiii