పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్

డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఎం.ఏ. పి. హెచ్.డి.,డి.లిట్., ఎం.పి. (రాజ్య సభ)

అధ్యక్షులు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి.

కళాభవన్, హైదరాబాదు - 500 004.


'కొప్పరపు కవులు' అసాధారణ ధారా సంపన్నులు. వారి ప్రౌఢ సమాస చాలనం, సమయోచిత శబ్ద చమత్కార ఖేలనం ఆశ్చర్య జనకాలు. ఆశుకవితా విన్యాసంలో ఎంత ధారాధురీణులో అవధానయాగ నిర్వహణలో అంతటి స్థితప్రజ్ఞులు 'కొప్పరపు సోదర కవులు'.

కొప్పరపు సోదర కవుల అవధాన పద్యాలను సంకలనం చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. అందుకు డా॥ గుండవరపు లక్ష్మీనారాయణ గారిని అభినందిస్తున్నాను.

పద్య విద్యాప్రియులు పదిల పరచుకొనే గ్రంథమిది.