పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండుగనాడు వారియింటికి నన్ను బిలుచుకొనిపోయి భార్యచేసిన భక్ష్యభోజ్యములను మిక్కిలి ప్రేమతో కుడువబెట్టిరి. అరవవారి యింట నేను భోజనముచేయుట కదియే మొదలు. కుప్పుస్వామయ్యగారు నన్ను తనకు నెడమప్రక్కను గూర్చుండబెట్టుచు అది వారియిండ్లలో సాంప్రదయముగ జెప్పిరి. కుప్పుస్వామయ్య అరవలైనను తెలుగుభాషయందువలెనే తెలుగువారి ఆచారముల పట్ల వారికి అభిమానము మెండు.

తాము అబ్బయ్యనాయుడుగారి పిల్లలకు ట్యూటరుపదవి మానుకొనిపోవునప్పుడు నన్ను ఆపనిలో ప్రవేశపెట్టుటకు తీసికొని పోయిరి. అప్పుడు ఇంగ్లీషుపాఠమును బాలురకు చెప్పుమని కోరిరి. నేను చెప్పి ముగించి యింటికివచ్చితిని. నేను (pudding) 'పుడ్డింగ్‌'అను పదమును 'పుడ్డింగ'నుటకుబదులు 'పడ్డింగ'ని ఉచ్చిరించితినట. అందువలన నన్ను ట్యూటరుగా నేర్పరచుకొనుట వారికి సమ్మతముగాకపోయెనని కుప్పుస్వామయ్యగారు నాతో నొచ్చుకొనుచు జెప్పిరి.

మేము ఎఫ్. ఏ. క్లాసులో చదువునపుడు 'మారన్‌'అను నొక ఉపాధ్యాయుడు ట్రిగ్నామెట్రీ బోధించుచుండెను. ఆయన చెప్పునదేదియు బోధపడకుండెను. ఆయనకు సహాయోపాధ్యాయు డొక యరవబ్రాహ్మణుడుకూడ ఆశాస్త్రమునే చెప్పుచుండెడి వాడు గాని ఆయన చెప్పుచుండగా విద్యార్థులు మితిలేని అల్లరి చేయుచుండెడివారు. ఆయనయును బోధనాశక్తియం దసమర్థుడే. కాబట్టి ఈశాస్త్రము బాగుగ బోధపడక మొదటిసారి ఎఫ్. ఏ.