పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విజయనగరమునకు వెళ్ళెనుగాని ఆమెప్రయత్నమును సఫలము కాలేదు.

నేను అంతకుమునుపే పునహానుంచి గుంటూరు వచ్చిన తోడనే "శారదనికేతనము" అనుపేరుతో వేటపాలెములో నాబంగళాలో విద్యాసంస్థ స్థాపింతుననియు స్త్రీవిద్యాభిమానులు సానుభూతిసహాయము లొసంగవలెననియు కోరుచు ఒక కరపత్రమును ముద్రించి, ఆంధ్రదేశమున ప్రముఖులైనవారి కందరికి పంపియుంటిని. అనేకులు ప్రోత్సాహవచనములతో ప్రత్యుత్తరములు వ్రాసిరి. పిమ్మట లక్ష్మీనారాయణగారిని మునగాల జమీందారుగారియొద్దకు బంపి వారికి దివానుగా నున్న శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారిద్వారా ప్రయత్నముచేసి, నాలుగువేలరూపాయలవిరాళమును వాగ్దానముచేయించుకొని, జాబితాలో ప్రప్రధమమున వారిసంతకముచేయించితిని. పిమ్మట న్యాపతి సుబ్బారావు, శెడింబి హనుమంతరావు, వేమవరపు రామదాసుగార్లు మున్నగు ప్రముఖ న్యాయవాదులచేతను, గుంటూరులో రాయసంవెంకటశివుడు, చట్టి నరసింహారావు మొదలగు స్నేహితులచేతను జాబితావేయించితిని. దాదాపు ఇరువదివేలరూపాయలవరకు జాబితామొత్తముఏర్పడెను. కానిలక్షరూపాయలు జాబితామీద పూర్తియగువరకు ఒక దమ్మిడియైనను వసూలు చేయగూడదని నియమముపెట్టుకొని గ్రామములో కొందరు ప్రముఖులను జూచి అనుకొన్నప్రకారము లక్షరూపాయలు పూర్తిచేయగల ననుధైర్యము నా కుండెను. ఈసంస్థను నపుడు వారినిగూర్చి ఆలోచింపబనిలేదనియు నామిత్రుడు చెన్నాప్రగడ