పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిచ్చియుండిరిగాన మేము నెరవేర్చకలిగిన దేదియు లేదని చెప్పుచు మనసున తలంచుకొని "తప్పులుచేసిన క్షమించు" మని నమస్కరించితిమి. ఆప్రకారమే మామువ్వురిభార్యలు నమస్కరించిరి. నేను వారి అస్తులను గంగలో కలిపెదనని సహితము నమస్కరించితిని. కాని కాకులు ఇంకను దూరముననే యుండెను. ఇంతలో నారెండవతమ్ముడు మేము యాత్రలకు బోయినపుడు తన్ను దిగవిడిచి పోతిరని నిష్ఠురముగ మాతండ్రిగారితో ముచ్చటించినట్లును అప్పుడు "నీవు పోవుతరుణ మొకటి రాగలదులే అప్పుడు పోవచ్చు" నని మాతండ్రిగా రనినట్లును చెప్పెను. అంతట నేను కాశికి వెళ్లునపుడు తమ్ముడు హరినారాయణనుగూడ తీసికొనివెళ్ళెదనని నమస్కరించితిని. వెంటనే కాకులును గ్రద్దలును గుంపులుగుంపులుగ వచ్చి పిండద్రవ్యమును తినిపోయెను. కనుక మరణానంతరము జీవులేదో సూక్ష్మరూపమున నుందురనుట కిది యొక దృష్టాంతము.

మాతండ్రిగారు చనిపోయినపిమ్మట దివ్యజ్ఞానసమాజములోని ప్రముఖు లొకరు వచ్చి వేటపాలెముబంగళాను చూచి అందు స్త్రీలవిద్యాసంస్థను స్థాపింతు మనిరి. బంగళా మొదలగు ఆస్తి అంతయు తమకు సంపూర్ణముగ నిచ్చివేయవలెననిరి. ఆ పద్ధతులు నాకు అంగీకారము కాకుంటచే వారిప్రయత్నము ఆగిపోయెను. మిస్‌టెనెంటు అను నొక ఆంగ్లేయస్త్రీ ఈప్రాంతమున సంచారముచేయుచు వేటపాలెము బంగళాకు వచ్చి, అచ్చట స్త్రీల విద్యాసంస్థ స్థాపించుటకై విజయనగరం మహారాణిగారి వలన లక్షరూపాయలవిరాళమును సముపార్జించెద నని చెప్పి