పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాజిస్ట్రేటుపట్ల ఆయనపక్షపాతమును అందరికి తెలిసినవిషయమగుటచే మేము వ్రాసినవాక్యములు సత్యదూరములుకావని ఎల్లరును గ్రహించినను మమ్మాత డేమి చేయునోగదాయని వ్యాకులత నొందుచుండిరి. నాగేశ్వరరావుగారు ఆ ఆసామిని ఆకస్మికముగ పట్టి, పోలీసుహవాలులో నుంచిన సమయమున న్యాయవాదులు చాలమంది యుండినకారణమున వా రందరి వలనను జరిగినవిషయము జరిగినట్లు వివరముగ తెలుపు ప్రమాణ పత్రములను వ్రాయించి, తీసికొని శ్రీ జె. డి. సామ్యుయల్ అను క్రిమినల్‌లాయరును మాపక్షమున పనిచేయుడని కోరగా ఆయన తోడిన్యాయవాది యగుటవలన ఉచితముగనే పనిచేయుటకు సమ్మతించి, వాయిదానాటికి దాఖలుచేయుటకు అర్జీ తయారుచేసెను. మా అర్జీలో వ్రాసిన అంశములు సత్యములనియు, పార్టీకి న్యాయముజరుగుటకు వ్రాయబడినవేగాని అధికారనిర్వహణమునకు అడ్డముగావించునవి కావనియు, మామీద జారీచేయబడిన నోటీసుచర్యను రద్దుపఱచవలెననియు వ్రాసి నాగేశ్వరరావుగారికోర్టులో మాతోపాటే హాజరై అర్జీని,న్యాయవాదు లిచ్చిన ప్రమాణపత్రములతోగూడ దాఖలుచేసి, తన పార్టీదారులైన ప్లీడర్లు అర్జీలో వ్రాసినవిషయము అఫిడవిట్లుమూలకముగ దృవపడుచున్నదిగాన వీరిమీద జరుపుచర్య న్యాయసమ్మతము కాదని వాదించెను. నాగేశ్వరరావుగారు ఈవాదనను అంగీకరించక మమ్ముల నిర్వురను క్రిమినల్ ప్రొసీజరుకోడ్డు 477 వ సెక్‌షనుక్రింద పోలీసుహవాలుచేసి వెంటనే మరియొక మొదటితరగతి మాజస్ట్రేటునొద్దకు బంపెను. ఈఉత్తరువు గ్రామములో గొప్ప సంచలనము గావించెను. ప్లీడర్లను