పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనము జోక్యము పుచ్చుకొనుట అవసరమని పలికినమీదట మేము ఇరువురమును భట్రాజు వెంకట్రాయుడుగారును కలిసి పండితనాగేశ్వరరావుగారికోర్టుకు వచ్చుసరికి ఆయన ఆనాటికి పని ముగించుకొని ఇంటికి వెడలిపోయిరి. ఆ రహితువలన వకాల్తునామ తీసికొని, అతని విడుదలనిమిత్తము నాగేశ్వరరావు గారియొద్దనే అర్జీ దాఖలుచేయుటకు నిశ్చయించుకొని పండిత నాగేశ్వరరావుగారు న్యాయవిరుద్ధముగను, నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినారని అర్జీలో వివరముగ వ్రాసితిమి. నాగేశ్వరరావుగారు ఇంటిలో నుండగా అక్కడనే వారి కిచ్చితిమి. వారు దానిని చేత దీసుకొని చదువుచుండగా ఇంచుక చేయి వణికినదిగాని వెంటనే దృడత్వమును బూని, "అర్జీదారునిపై వేయబడిన ఉత్తరువును రద్దుపరచుటకు కారణము లే"దని యుత్తరువువేసెను. అంతట మేము అప్పటికి చేయునదేమియు లేదని యింటికి చేరితిమి. ఆ రహితు ఎటులనో జామీనిచ్చి యింటికి జేరెను. నాగేశ్వరరావుపంతులు తనకు మేమిచ్చిన అర్జీలోతాను నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినాడని మేము వ్రాసిన అంశమును ఆధారముచేసుకొని మమ్ముల నిరువురిని ఎందుకు ప్రాసిక్యూషను చేయగూడదో సంజాయిషీ చెప్పవలసినదని నోటీసులు పంపించుచు, జిల్లాజడ్జిగారికిగూడ ఇందువిషయమున మామీద చర్యజరుపవలసినదని లేఖ యొకటి వ్రాసి పంపెను.

ఈనోటీసు మాకు పంపినవిషయము బందరుపురమునందంతట ప్రాకిపోయెను.నాగేశ్వరావుగారి చర్యలును, అవనిగడ్డ