పుట:Kavitvatatvavicharamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ప్రథమ భాగము 91 ఉ. ఇట్టి మనోహరాంగుఁ డొకఁ డెందయినం గలఁడేని, కల్గియుం గట్టిగ నాకతండు బిగి కౌcగిటఁజేర్పఁగ వచ్చునేని, నే నిట్టట్టుఁ గొంకినన్ విడక యిష్ట విహారము లెల్లఁ గాంక్షఁ జే పట్టి యొనర్చునేని, రసభావము లెట్టివి యొక్కొ యత్తజిన్ !"

            (ప్రభా. ఆ.3,ప.41)                                                                                                    మఱి చెలికత్తె ప్రభావతియొక్క విరహ చిహ్నములను శుచి ముఖికిం జూపుట దిలకింపుడు.
            సీ.   నెలఁత ముక్కరయందు నీలంబుగాదు సూ
                              తెలిదళుకొత్త ముత్తియము గాని, 
             యువిద సందిళ్ళ బాహుపరులు గావు సూ
                               మితిచూడ నిడిన యూర్మికలుగాని, 
             సుదతి పాలిండ్లఁ గస్తురి నల్పు గాదు సూ 
                                 కనుదోయి కాటుక కప్పుగాని, 
                 రమణి కర్ణికల వజ్రపు దీప్తిగాదు సూ
                                 ప్రాగెంపుదునకల రంగుగాని, 
          తే.      యూర్పువేఁడిమిఁ గృశత బాష్పోదయమున 
                   గండపాండిమ దత్తత్ర్పకారములను 
                   గానఁబడియెడు నోవిహంగమ పురంద్రి 
                   యింక నీచేతనున్నదీ యింతిబ్రతుకు" 
                                                                                      (ప్రభా. ఆ. 3, ప. 87)
                చెలికత్తెలీరీతిఁ జెయి వేసి విప్పిచూపుటకోర్చెడు రాజకన్యక లెంత సుకుమారులు ! పూర్వము ఱవి కెల ధారణ మే యున్నట్టు లేదు. రాణివాసములో నే మైలయు సోఁకక పెరిగిన కన్యామణి తన భావము ప్రకటించురీతి వినుండు .
                         “సీ.   ఆ రతికిఁ గరంబు లైతిరే నవ్విభుఁ
                                              గౌగలింపఁగ నబ్బుఁగరములార !
                                ఆ యింతికిఁ గుచంబు లైతిరే నతని వ
                                             క్లోనిపీడన మబ్బుఁ గుచములార !
                                ఆ లతాంగికిఁ జెక్కులైతిరే నారమ్య
                                               శీలుచుంబన మబ్బుఁ జెక్కులార!
                                 ఆ నెలంతకు వీనులై తిరే నా కళా
                                                విదు మంతనం బబ్బు వీనులార !